దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25
ప్రజాశక్తి-గుంటూరు:విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 2024ా25 సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వర్సిటీలో బిటెక్, బిఫార్మసీ, బిబిఎ, బిసిఎ, బిఎస్‌సి, బిఎ, ఎల్‌ఎల్‌బి, బిబిఎ ఎల్‌ఎల్‌బి, బిఎస్‌సి (హానర్స్) అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబిఎ, ఎంసిఎ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఎ ఇంగ్లీష్, సిహెచ్‌డి ప్రవేశాలకు బుధవారం యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ పి నాగభూషణ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిటెక్, బిఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న వీశాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్చి ఒకటి నుంచి నుంచి ఏప్రిల్ 30 వరకు ఎపి, తెలంగాణాతోపాటు, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీ డీన్ డాక్టర్ కెవి కృష్ణకిషోర్ మాట్లాడుతూ వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖ, ఏలూరు, రాజమండ్రిలలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, షషష.ఙఱస్త్రఅaఅ.aష.ఱఅ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫిబ్రవరి 25లోగా దరఖాస్తులు పూర్తిచేయాలన్నారు. వీశాట్‌లో తొలి 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం, 51ా200లోపు ర్యాంకుల వారికి 25 శాతం, 201ా2000లోపు ర్యాంకులు సాధించినవారికి పది శాతం స్కాలర్‌షిప్ కింద ఫీజు మినహాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పిఎంవి రావు, డైరెక్టర్ అడ్మిషన్స్ ఎ గౌరిశంకర్‌రావు పాల్గొన్నారు.