ప్రజాశక్తి-విశాఖ : ఉక్కునగరం అంబేద్కర్ కళాక్షేత్రం మరియు జ్యోతి బాల విహార్ ఆవరణంలో బాలోత్సవం వేడుకలు ఎమ్మెస్ ఎన్.మూర్తి అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టీల్ ప్లాంట్ జిఎం ఎం.మధుసూదన్ రావు పాల్గొని మాట్లాడుతూ ఉక్కు నగరంలో ఇన్ని వేల మందితో పిల్లల పండుగ ప్రారంభం కావడం చాలా గర్వకారణమని పిల్లలు చదువులతో పాటు విజ్ఞానం, వినోదం, ఆటలు వంటి కార్యక్రమాలు ఉంటే పిల్లలు మరింత అభివృద్ధి చెందుతారని తెలిపారు. పిల్లల్లో దేశభక్తి అభ్యుదయ భావాలు, శాస్త్రీయ విలువలు పెంచే ఇలాంటి ఫెస్టివల్ కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతాయన్నారు. మరొక అతిథి గాజువాక మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ ఏం.సునీత మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలల్లో రాణించాలంటే తప్పనిసరిగా వారిలో విజ్ఞాన, వైజ్ఞానిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటే సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లో రాణించాలని కేవలం చదువుల్లోనే కాకుండా అన్ని రంగాల్లోను నైపుణ్యాన్ని పెంచుకోవాలని అప్పుడే సంపూర్ణ విద్యార్థిగా తయారవుతారని తెలిపారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాలను మరింత మంది చొరవ తీసుకొని నిర్వ హించాలని దీనిద్వారా విద్యార్థులో సృజనాత్మక పెరిగి అభివృద్ధి చెందుతారని ఆమె అన్నారు. ఉక్కునగరం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా అన్ని రంగాల్లోని రాణించాలని ముఖ్యంగా విసిసి ఇలాంటి చిల్డ్రన్ ఫెస్ట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న చైతన్యాన్ని ప్రతిభాపాటకాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. విసిసి కన్వీనర్ కె.సుశీల మాట్లాడుతూ ఈ పేస్టులో 74 ఈవెంట్స్ లో సుమారు రెండు వేల మంది పిల్లలు పాల్గొంటున్నరని ఆమె అన్నారు. ఉక్కునగరం మరియు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో గల విద్యాసంస్థల నుండి విద్యార్థులు వచ్చి ఈ రెండు రోజుల పాటు ఈవెంట్స్ లో పాల్గొంటారని అన్నారు. అలాగే న్యాయ నిర్ణీతలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరియు అనేకమంది ప్రముఖులు ఉంటారని వాళ్ళందరూ సహకారంతో ఈ పేస్టును నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బి పద్మావతి జాయింట్ సెక్రెటరీ ఆఫ్ డిస్టిక్ మాస్టర్ అథర్స్, డి మధుసూదన్ రావు, మాజీ లోటరీ క్లబ్ అధ్యక్షులు, ఈ లోకేష్ కోపరేటివ్ డైరెక్టర్, కె.విమల, 78వ వార్డు మాజీ కార్పొరేటర్ రేణుక ప్రసాద్, సత్య సాయిబాబా ట్రస్ట్ కె.వి.ప్రసాద్, జనవిజ్ఞాన వేదిక కార్యక్రమం నిర్వాహకులుగా టినా, సుమలత, సుమతి పద్మ, అంబిక పాల్గొన్నారు.