ప్రజాశక్తి-అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు నెలలకే ఈ దంపతులు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు అనుకున్న ఈ జంట అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే దంపతులు ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాల గురించి తెలియలేదు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ జనార్దన్ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.