ప్రజాశక్తి-కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్‌ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు రిమాండ్‌ను పొడిగించింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ కావాలనే అక్రమ కేసులు పెట్టి జైలుపాల్జేసిందని టీడీపీ ఆరోపణలు చేసింది.
