వేరుశనగ రైతులను ఆదుకోవాలి : రైతు సంఘం

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని మార్కెట్లో యాడ్లో వేరుశనగ రైతులు వ్యాపారస్తుల చేతిలో తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్లు,సిఐటియు జిల్లా అధ్యక్షులు పీ.ఎస్.రాధాకృష్ణ తెలిపారు. శనివారం వారు మార్కెట్ యార్డ్ లో వేరుశనగ పంటల ధరలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ క్వింటాలు వేరుశనగ ధరలు 5500 రూపాయలు,అలాగే 7500 రూపాయలు ప్రకారము ధరలు ఉన్నాయని రైతులు చెప్పారు.ఎకరాకు కేవలం రెండు మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని 50వేల రూపాయల వరకు ఖర్చయిందని ప్రతి ఎకరాక 30 వేల రూపాయలు పైగా నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు.కనీసం క్వింటాల్కి ఎనిమిది వేల రూపాయలు ప్రకారం కొనుగోలు చేయాలని అలాగేటెండర్వి వేసిన వెంటనే వ్యాపారస్తులు గ్రేడింగ్ చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కరువుతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఎకరాకు 30 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు తిప్పన్నా,గోపాల్ పాల్గొన్నారు.

➡️