సంగం డెయిరీ డైరెక్టర్‌ అరెస్టు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ చెల్లింపుల్లో ఏర్పడిన వివాదంలో గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరెక్టర్‌ గొల్లపల్లి శ్రీనివాస్‌తోపాటు ఇద్దరు ఉద్యోగులను చేబ్రోలు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ కార్యాలయం వద్ద ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేటకు చెందిన పాడి రైతు ముసునూరి రాముకు, డెయిరీ సిబ్బందికి మధ్య ఈ నెల 15న ఘర్షణ చోటుచేసుకుంది. బోనస్‌ చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని ప్రశ్నించిన తనపై డెయిరీ చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, పలువురు డైరెక్టర్ల ప్రోద్బలంతో దాడి జరిగిందంటూ పోలీసులకు రాము ఫిర్యాదు చేశారు. దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ సహా 15 మందిపై పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డైరెక్టర్‌ గొల్లపల్లి శ్రీనివాస్‌ను, డెయిరీ ఉద్యోగులను ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నరేంద్రకుమార్‌ అజ్ఞాతంలో వెళ్లిపోయారు.

➡️