ప్రజాశక్తి-యంత్రాంగం : మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని నెల్లూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందన్నారు. మూడో తేదీ నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి అధికారికంగా సమాచారం అందిందన్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే తక్షణమే బయటకు వచ్చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కోత దశకు వచ్చిన పంటలన్ని కోతతో తక్షణమే భద్రపరుచుకోవలన్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లోని ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ(సోమవారం) నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ ప్రకటన విడుదల చేశారు.