కాంగ్రెస్‌ వస్తే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ : మంత్రి కేటీఆర్‌

Nov 23,2023 16:05 #minister ktr, #speech

తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌యే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 70 నుంచి 82 సీట్ల మేర వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అవడం ఖాయమన్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్‌ వాళ్లు ప్రతి ఆరునెలలకో సీఎంను మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. అదే సమయంలో పాలనాపరమైన నిర్ణయాలను సైతం త్వరితగతిన తీసుకోలేరని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ రంగం 28 శాతం మేర పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం శరవేగంగా పెరుగుతోందని వెల్లడించారు.

➡️