ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా):బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం, చల్లారెడ్డిపాలెం పంచాయతీ, జబ్బర్కాలనీలో స్థానిక బిబిహెచ్ డిగ్రీ కాలేజీ ఎదురుగా సిమెంట్ రాయి కార్ఖానా ఉంది. ఈ కార్ఖానా నిర్వహిస్తోన్న తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు తన పక్క ఇంట్లోని బాలికపై తరచూ లైంగిక చర్యలకు పాల్పడేవాడు. బాలిక శరీరంలో మార్పులను గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారణవ్వడంతో తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయట పడింది. జిల్లా ఎస్పికి బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శనివారం కోర్టులో హాజరపరచగా.. కోర్టు రిమాండ్ విధించినట్లు వేటపాలెం ఎస్సై సురేష్ తెలిపారు.