హైదరాబాద్ : శనివారం రాత్రి రాహుల్ నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్‌చాట్ నిర్వహించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ ఉదంతం, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాగా, ఉద్యోగార్థులపై సీఎం కేసీఆర్ తీరును రాహుల్ ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు పోటీ పరీక్షల అభ్యర్థులతో కలిసి చిక్కడపల్లిలోని బావర్చీ హౌటల్‌లో బిర్యానీ తిన్నారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.
