పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

Nov 25,2023 15:12 #minister ktr, #speech

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్‌ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతా కాంగ్రెస్‌ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్‌ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్‌ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్‌ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

➡️