హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని దుయ్యబట్టారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, బీఆర్ఎస్లోని అవినీతిపరులను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు.