హైదరాబాద్: హైదరాబాద్ శివారు ఆదిభట్ల ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓఆర్‌ఆర్‌పై వెళ్తుండగా ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలపై ఆరా తీశారు. మంటల్లో సజీవ దహనమైన వ్యక్తి కోదాడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
