ప్రజాశక్తి – కురుపాం:పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్ అధికారి వివి శివరామప్ప (60) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో తన మనువరాలి అన్నప్రసన్నం కార్యక్రమానికి వెళ్లగా, అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. బబ్బిలిలో ఉంటూ కురుపాంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.