ప్రజాశక్తి – పెద్దాపురం : కార్మికుల మధ్య ఐక్యత ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. పాండవ గిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన సమారాధన లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరింప చేసేందుకు బవన నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల కార్మికులు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారు. ఆప్కో మాజీ డైరెక్టర్, చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముప్పన శ్యామలాంబలు ఈ వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ పెద్దిరెడ్డి నరేష్, లక్ష్మణ్ దివాకర్, ప్రశాంత్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గడిగట్ల సత్తిబాబు, మాగాపు నాగు, సిరపరపు శ్రీనివాస్, నీలం శ్రీను, కంపర్ వీరబాబు, చందు, కరణం అప్పారావు, వడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.