మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు అస్వస్థత

Nov 27,2023 20:28 #YCP Minister
  • ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మంత్రి

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నించి మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మణిపాల్‌ ఆసుపత్రి వైద్యులు మంత్రి వేణుగోపాలకృష్ణను 24 గంటల పరిశీలనలో ఉంచారు. మంత్రి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

➡️