హెచ్‌.ఐ.వి. బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్ల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

Dec 1,2023 16:22 #awareness, #collector, #Vizianagaram
lunch with aids victims and transgenders

వారిలో ఆత్మ‌విశ్వాసం క‌ల్పించేందుకు వైద్య ఆరోగ్య‌శాఖ వినూత్న ప్ర‌య‌త్నం

ప్రజాశక్తి-విజయనగరం కోట : హెచ్‌.ఐ.వి.బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్ల ప‌ట్ల స‌మాజంలో వివ‌క్ష‌త పోగొట్టి వారు కూడా స‌మాజంలో ఇత‌రుల‌తో స‌మాజంలో క‌ల‌సి జీవించేందుకు అనువైన ప‌రిస్థితులు ఏర్ప‌ర‌చే ల‌క్ష్యంతో విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒక వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని లెట్ క‌మ్యూనిటీస్ లీడ్ అనే నినాదంతో ఈ ఏడాది నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా జిల్లాలోని హెచ్‌.ఐ.వి. బాధితులు, ట్రాన్స్‌జెండ‌ర్ల‌తో శుక్ర‌వారం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యంలో స‌హ‌పంక్తి భోజ‌నం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖాధికారి డా.ఎస్‌.భాస్క‌ర‌రావు, జిల్లా క్ష‌య‌, కుష్టు, ఎయిడ్స్ నియంత్ర‌ణ అధికారి డా.కె.రాణి, జిల్లా స‌మాచార పౌర‌సంబంధాల అధికారి డి.ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొని వారితో క‌ల‌సి భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా డి.ఎం.హెచ్‌.ఓ. వారంద‌రి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స‌మాజంలో వారూ ఒక భాగ‌మే, వారికి స‌మాజం తోడ్పాటు వుంటుందని చెప్పేందుకే ఈ ప్ర‌య‌త్నం చేశామ‌ని, వారిలో ఆత్మవిశ్వాసం క‌ల్పించేందుకు ఇది దోహదం చేస్తుంద‌ని డి.ఎం.హెచ్‌.ఓ. పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ డి.ఎం.హెచ్‌.ఓ. డా.ఎన్‌.సూర్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇమ్యూనైజేష‌న్ అధికారి డా.ఆర్‌.అచ్యుత కుమారి, పొజిటివ్ నెట్‌వ‌ర్క్ సంస్థ ప్ర‌తినిధి ప‌ద్మ‌, ట్రాన్స్‌జెండ‌ర్ల సంఘం అధ్య‌క్షురాలు మీనాకుమారి, నాగ‌మ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

➡️