ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాలు కట్టడి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన తరువాత వాటి తీవ్రత మరింత పెరిగిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య కళాశాలలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని కర్నూలు, ఒంగోలు మెడికల్ కళాశాలల్లో గంజాయి బ్యాచుల దాడులతో స్పష్టమైందని పేర్కొన్నారు. యువత భవిత నాశనమవుతుందనే ఆందోళనతో ప్రధాన మంత్రికి లేఖ రాశానని వివరించారు. విశాఖలో జరిగిన పాఠశాలల పిల్లల ఆటో ప్రమాదం తనను షాక్‌కు గురిచేసిందని మరో ప్రకటనలో పేర్కొన్నారు.