-
సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలతోరణం వరకు యాత్రికులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని యాత్రికులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.గురువారం 62,494 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకోగా 27, 666 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చిందని తెలిపారు.