ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న సుగాలి పద్మావతి ఈరోజు తెల్లవారుజామున ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. సుగాలి పద్మావతి భర్త వెంకట్రాముడు పాతూరు కూరగాయల మార్కెట్లో పనిచేస్తాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హైదరాబాదులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు సెంట్రింగ్ పని చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.