ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద గల గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏ వ్యవస్థ అభివృద్ధి చెందినా అది ఇంజనీర్ల గొప్పదనమేనని అన్నారు. సమాజానికి ఇంజనీర్ల సేవలు అవసరం అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నానని సంస్థ లో ఉద్యోగుల పదోన్నతులకు మంత్రిగా వచ్చిన కొత్తలో నే ఆమోదం ముద్ర వేశామని సంస్థ నిర్మాణాలు తో గిరిజనులకు మేలు జరగాలి అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని కోరారు.
అనంతరం సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్, విశాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాస్, మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బెంగుళూరు బృందావన్ గార్డెన్స్ ను ఆయనే అభివఅద్ధి చేశారు అని గుర్తు చేశారు.క్వాలిటీ కంట్రోల్ విభాగం కోసం రూ.30 లక్షలు కేటాయించారు అని ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాత్రుడు , డిఈఈ వీ.వంశీ కఅష్ణ, గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టర్స్ సంఘం అధ్యక్షుడు ఆనంద రావు సంస్థ ఉద్యోగులు పాల్గన్నారు. అనంతరం విశాఖ, అరకు, పాడేరు, సీతం పేట, పార్వతి పురం డివిజన్ ఇంజనీర్లు ఉప ముఖ్యమంత్రి ని ఘనంగా సత్కరించారు.