ప్రజాశక్తి-తిరుమల : ప్రధాని మోడీ తిరుపతి పర్యటన సందర్భంగా విధులకు హాజరైన డిఎస్పీ కృపాకర్ (59) గుండెపోటుతో మృతి చెందారు. ప్రధాని పర్యటనకు ఇంటిలిజన్స్ సెక్యూరిటీ వింగ్ గా విధులకు నిర్వహిస్తున్న కృపాకర్ శ్రీవారిమెట్టు మార్గంలో 1805వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. కృపాకర్ విజయవాడ సమీపంలో పోరంకి గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది.
