తెలంగాణ: ‘తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదు ..అవినీతి,దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన” అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ ను తలపించిన తాలిబాన్ల పాలన.5 లక్షల కోట్లు అప్పులు చేసి,ఒక్కో నెత్తిమీద 2 లక్షల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలే.దేశంలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నెంబర్ 1 ఉంటే.. నిరుద్యోగులు 50 లక్షల మంది ఎందుకున్నట్లు? ఉద్యోగాలిస్తే వందలాది మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్లు? 10 ఏళ్లలో పట్టుమని 65 వేల ఉద్యోగాలు ఇవ్వచేతకాని మీరు..ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు,నిరుద్యోగులను ఉద్ధరించినట్లు బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతున్న తీరుకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాకుండా ఉంది. మీ దరిద్రపు పాలనలో టీఎస్పీఎస్సీ లీకుల బాగోతం దేశమంతా ఎరుకే. ఇంకా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారని కల్లబల్లి కబుర్లు చెప్పడం మీ అవివేకానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు.