ప్రజాశక్తి-తిరుపతి: ప్రధాని మోడీ తిరుపతి రాక సందర్భంగా సిపిఎం నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. దీనిలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళీని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. తెలంగాణ ఎన్నిక ప్రచారంను ఆదివారం రాత్రి ముగించుకొని ప్రధాని తిరుపతికి చేరనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేయనున్నారు. సోమవారం తిరుగు ప్రయాణం చేయనున్నారు.
