ప్రజాశక్తి-శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బి.తులసీదాస్ శుక్రవారం డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రాజెక్టులు సరిగ్గా లేనందున, రైతన్నలు పండించే అవకాశం ఉన్న ప్రాంతాలు కూడా దుర్భిక్షం పలకరించదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.