హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ అతిక్రమించడమేనని ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరోవైపు, తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
