‘సర్వరాయ’ గుర్తింపు సంఘం ఎన్నికల్లోసిఐటియు ఘన విజయం

Dec 1,2023 08:48 #CITU

ప్రజాశక్తి – కడియం(తూర్పుగోదావరి జిల్లా)తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలోని సర్వరాయ సుగర్స్‌ బాట్లింగ్‌ యూనిట్‌ (కోకో కోల)లో గురువారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు అనుబంధ సంఘం శ్రీ సర్వరాయ సుగర్స్‌ లిమిటెడ్‌ బాట్లింగ్‌ యూనిట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 141 ఓట్లకు 134 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో సిఐటియుకి 86, ఎఐటియుసికి 48 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల ఆధిక్యంతో సిఐటియు విజయం సాధించింది. ఫలితాల అనంతరం విజయోత్సవ సభ జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడారు. సిఐటియుని గెలిపించిన కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం, ఇతర సమస్యలు పరిష్కారానికి సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందబాబు, బి.రాజులోవ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️