ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తణుకు బాలోత్సవాల బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి – తణుకురూరల్ (పశ్చిమగోదావరి జిల్లా) : విద్యార్థినీ, విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు బాలో త్సవాలు దోహదం చేస్తాయని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. గురువారం శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో బాలోత్సవాల బ్రోచర్‌ను, పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్ (అపుస్మా) తణుకు జోన్ అధ్యక్షులు పెన్మెత్స రామరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అభిరుచులను, సృజనాత్మకత వెలికితీతకు తణుకు బాలోత్సవాలు ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, స్పెల్‌బి, క్విజ్, మెమరీ టెస్ట్, చిత్రలేఖనం వంటి అకడమిక్ అంశాలు, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, శాస్త్రీయనృత్యం, కోలాటం తదితర సాంస్కృతిక అంశాల్లో ఈ ప్రదర్శ నలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపుస్మా తణుకు శాఖ కార్యదర్శి రాజశేఖర్, కోశాధి కారి నగేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు విద్యాకాంత్, పలు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, శ్రీశ్రీ సేవావిజ్ఞాన కేంద్రం బాధ్యులు, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పి.దక్షిణామూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిఎల్.నరసింహారావు, ప్రగతి విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగతి రాజా పాల్గన్నారు.