చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. సుప్రీంకోర్టులో మరికాసేపట్లో విచారణ

Nov 28,2023 11:22 #Nara Chandrababu, #Supreme Court

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. గత వారం సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సీఐడీ కోరింది. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బేలా త్రివేది , జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్‌ 64గా లిస్ట్‌ అయ్యింది.

➡️