హైదరాబాద్ : సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీరాంగోపి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 58, ప్లాట్ నంబరు 1141 యజమానురాలు మాధురి విదేశాల్లో ఉంటున్నారు. ఇంటి విక్రయం వ్యవహారంలో స్వాతి దీక్షిత్ ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇరువర్గాల మధ్య డబ్బుల విషయంలో విభేదాలు తలెత్తడంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. సోమవారం మధ్యాహ్నం కారుతో ఇంటి ముందు గేటును ధ్వంసం చేసి స్వాతి దీక్షిత్‌తో పాటు 20 మంది ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న కాపలాదారు కుటుంబ సభ్యులైన శోభ ఆమె భర్త అశోక్‌ను దుర్భాషలాడి, ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు శోభ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వాతి దీక్షిత్, చింతల సాయి ప్రశాంత్, రణవీర్ సింగ్, రామ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.