తెలంగాణలో మరోసారి రాబోయేది బిఆర్‌ఎస్‌యే: కేటీఆర్‌

Nov 19,2023 15:40 #minister ktr

ఇల్లెందు: చిన్న చిన్న అసంతఅప్తులను పక్కనపెట్టి బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లెందులో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో 11 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ 24 గంటల కరెంట్‌ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే 24 గంటల విద్యుత్‌ ఇచ్చామన్నారు. తెలంగాణలో మరోసారి రాబోయేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
”కారణాలు ఏమైనప్పటికీ భద్రాచలంలో ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలి. కారు గుర్తు అభ్యర్థి గెలవాలి. గత రెండు పర్యాయాలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు. దానివల్ల కొంత గ్యాప్‌ వచ్చింది, ఈసారి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించండి, వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. యాదాద్రి కంటే గొప్పగా.. భద్రాచలం రామాలయాన్ని అభివఅద్ధి చేస్తాం. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అడుగుతోంది. ఇప్పటివరకు 11 ఛాన్స్‌లు ఇచ్చారు. కొంతమంది డబ్బు సంచులతో వస్తున్నారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు” అని కేటీఆర్‌ కోరారు.

➡️