రెచ్చిపోయిన ఆకతాయిలు

Nov 24,2023 15:21 #APSRTC, #Attacks, #Chittoor District
attack on rtc driver

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలం సచివాలయం పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు. బస్సుకు అడ్డంగా కారు ఉందని తీయమని బస్సు డ్రైవర్ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆకతాయిలు ‘మా కారునే తీయమని అంటావా’ అంటూ డ్రైవర్ ను బస్సు నుండి కిందకు దింపేశారు. విచక్షణారహితంగా డ్రైవర్ పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కొందరు స్థానికులు ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద జరిగిన ఘటన లాంటిదే చిత్తూరు జిల్లా పచిక్కపళం జరిగింది.

➡️