డిప్యూటీ సిఎం ‘కొట్టు’పై పిల్‌ డిస్మిస్‌

Nov 30,2023 08:41 #AP High Court
ap high court

పిటిషనర్‌కు రూ.50 వేలు జరిమానా
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై టిడిపి నేత వలవల మల్లికార్జునరావు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. రాజకీయ ప్రేరేపితంగా పిల్‌ దాఖలు చేశారని పిటిషనర్‌కు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు చెప్పింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కడకట్ల గ్రామం గణేష్‌ నగర్‌ నుంచి జాతీయ రహదారి వరకు కొత్త రోడ్డు నిర్మాణం కోసం టెండర్లను పిలిచారు. దీనిపై పిటిషనర్‌ అనేక సందేహాలను లేవనెత్తుతూ ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని ఆఫీసర్లు పట్టించుకోలేదంటూ పిటిషనర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ భూముల కోసమే రోడ్డు నిర్మాణం చేస్తున్నారని పిటిషనరు వాదన. జాతీయ రహదారితో అనుసంధానం కోసం రోడ్డు నిర్మాణం చేస్తున్నారని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనరుకు రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.

తాజా వార్తలు

➡️