కర్నూల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎస్

Nov 29,2023 16:23 #AIKS, #Drought, #Kurnool, #meeting
aiks national council logo release

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగో ఆవిష్కరణ.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలులోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జి .రామకృష్ణ, శివరాం ప్రసాద్, మల్లెల .పుల్లారెడ్డి, ఈ .పుల్లారెడ్డి, జె.ఎన్ శేషయ్య, జె.నాగేశ్వరరావు, టి. రాముడులు కలిసి ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కరువు విలయతాండవం చేస్తుందని చెప్పారు. 400 మండలాల్లో 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదని ప్రభుత్వం పునః పరిశీలించి గ్రామాల వారిగా అధ్యయనం చేసి కరువు మండలాలను ప్రకటించాలని చెప్పారు. అన్ని జిల్లాలలో వర్షాభావం ఉందని, కర్నూలు జిల్లాలోని అక్టోబర్ మాసంలో 99 శాతం లోటు వర్షపాతం నమోదయిందని తెలిపారు. తుగ్గలి క్రిష్ణగిరి కర్నూలు మినహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. గ్రామ యూనిట్గా కరువు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. 26 లక్షల ఎకరాలు వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు కూడా వేయలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాకు పది లక్షల వరకు రుణాలు ఖరారు చేయాలన్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్ల,వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు జిల్లాలో ని రైతులు వలసలు వెళ్లారన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు, 15వ తేదీ న జరుగు రైతుల సభ విజయవంతం కావాలని అన్నారు. ఆహ్వాన సంఘం నాయకులు శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో కరువు విలయతాండవం ఆడటానికి నీటిపారుదల లో వెనకబడి ఉండడమే అన్నారు. తెలంగాణ పచ్చదనం ఉట్టిపడుతుందని చెప్పారు. కృష్ణ తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ 1947 నుండి పాలకులు నీటిపారుదల రంగాన్ని విస్కరించడం వల్లనే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నారు. కార్పొరేట్ రంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతు రంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ రైతును విస్మరించడం వల్లనే అప్పులపాలై చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు అన్నారు. అఖిలభారత జాతీయ కౌన్సిల్ సమావేశాలను గురించి ప్రచారం అధికంగా చేయాలని సూచించారు. ఈ పుల్లారెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు వలసలు కర్నూలు జిల్లాలోని ఎక్కువగా జరిగాయని, ఇలాంటి సందర్భంలో జాతీయ సమావేశాలు కర్నూలు జిల్లాలో జరపాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో ఇల్లు పడిపోతున్నాయి రైతుల పిల్లల వివాహాలు జరగడం లేదు అన్నారు. పంట కాలువలు తీసి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సిద్దాపురం చెరువుకు నీరు నింపక పోవడం వల్లే వేల ఎకరాలు బీడుపడి రైతులు ఉపవాసాలు ఉంటున్నారని చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు దేశం నలుమూలల నుండి వచ్చే నాయకుల వత్తిడితో కర్నూలు జిల్లాలోని రైతాంగ పరిస్థితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల కన్నా కర్నూలు జిల్లాలోని ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు. రైతాంగాన్ని విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పారు. రైతులకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీన జరిగే ర్యాలీ బహిరంగ సభలను రైతులు రాజకీయాలకతీతంగా డిసెంబర్ 15 ,16, 17 తేదీల్లో జరుగు జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో రాజకీయాలకు ఆతీతంగా రైతులు పాల్గొని నిరసన తెలిపి, జయప్రదం చేయాలని కోరారు.

➡️