వరంగల్: ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు బానెట్‌లో నోట్ల కట్టలు పెట్టుకుని శుక్రవారం వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు బయల్దేరారు. బల్లికుంట క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ కారును నిలిపివేసి పరారయ్యాడు. ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఇదంతా సినీఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది.ఈ డబ్బు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఉన్న కొన్ని నోట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా దగ్ధమైన కారును మామునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. కారు, అందులోని నగదు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.