- 24 రోజుల సాధారణ, 17 ఐచ్ఛిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024 సంవత్సరానికి సంబంధించిన సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి సెలవులకు సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పండగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 24 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేద్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపారు. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించారు.