విశాఖ : స్కూల్ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. పిల్లలకు, ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పంది అడ్డురావడంతో ఆటో బోల్తా పడినట్లు సమాచారం. చికిత్స కోసం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
