హైదరాబాద్ : సీపీఐ(ఎం) ముషీరాబాద్ అభ్యర్థి ఏం దశరథ్కి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు ప్రారంభించారు. ఈ ర్యాలీ బాగ్ లింగంపల్లి నుంచి ప్రారంభమైన ఈ చిక్కడపల్లి, కావాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, రాంనగర్, ముషీరాబాద్ మీదుగా సాగుతుంది. ఈ ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజీ నర్సింహా రావు, పి.ప్రభాకర్, హైదరాబాద్ సిటీ సెంట్రల్ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ జ్యోతి, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్, ఎం.మహేందర్, నాయకులు జి.నరేష్, రాములు, డీఎల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.