విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరం అని … బోట్ల యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఘటనపై విచారణ చేపట్టి భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలని కోరారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. నిన్న రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40 బోట్లు దగ్ధమయ్యాయి.
విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి : పవన్ కల్యాణ్
