ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిస్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వంద మురుగు శుద్ధి వాహనములను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అందజేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఈ వాహనాలను ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మున్సిపాలిట్లో మురుగునీటి శుద్ధి కోసం ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా మహిళలకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పార్లమెంట్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణగోపాలరెడ్డి, ఐజి పాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.