ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తున్నందుకే నరేంద్రపై అక్రమకేసులు : అచ్చెన్నాయుడు

Nov 17,2023 14:41
ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తున్నందుకే నరేంద్రపై అక్రమకేసులు : అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారని నిలదీశారు. పాడిరైతుల ప్రగతికి కృషిచేసే నరేంద్ర, రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. సిఎం జగన్ కు ఇంకా 5 నెలలే ఉందని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రం నుంచి తన్ని తరుముతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

➡️