నకిలీ టిసిల అరెస్టు

Nov 29,2023 20:46 #arrested, #fake tc

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా)రైల్వే టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను టార్గెట్‌ చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ టిసిల గుట్టును చీరాల రైల్వే పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రట్టు చేశారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు..తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా గొడ్లకొండ గ్రామానికి చెందిన బనోత్‌ కల్యాణ్‌, మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుడూర్‌ మండలానికి చెందిన బాధవత్‌ ప్రవీణ్‌, వరంగల్‌ జిల్లా పార్వతిగిరికి చెందిన గుగులోత్‌ గణేష్‌ కొంతకాలంగా రైల్వే టిసిలుగా నకిలీ ఐడి కార్డు, ఛార్ట్‌లతో చెలామణి అవుతూ వచ్చారు. టికెటు లేకుండా ప్రయాణించే వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మంగళవారం రాత్రి ఈ ముగ్గురూ చీరాల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులకు టిసిరాజేష్‌ సమాచారం ఇచ్చారు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.

➡️