పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాంలు పాల్గన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వారు విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తదని విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేసాడని అన్నారు.సీఎం జగన్ మంత్రివర్గంలో 80 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ఇచ్చారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు 14 ఏళ్లుగా చంద్రబాబుకు గుర్తుకు రాలేదని.. ఒక ఓటర్‌గా మాత్రం గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు గుంపులుగా వస్తాయి. సింహం జగన్ సింగిల్‌గా వస్తారన్నారు. పత్తికొండ నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమని.. మొట్టమొదటిసారి మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీదేవినే ప్రకటించారని చెప్పారు.కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలలో గెలిపిస్తామని సీఎం జగన్‌కు హామీ ఇస్తున్నామని వారు వెల్లడించారు.