సికింద్రాబాద్: మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని, పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట డివిజన్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ సనత్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ”పేదల ఖాతాల్లో మోడీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ చెప్పారు.. చేశారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు.. ఇచ్చారా? ఆప్ సర్కారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారు. ఆయన ఆప్తో మద్యం స్కామ్లో పాలుపంచుకున్నారు. కుమార్తె కోసం కేసీఆర్ మోడీతో చేతులు కలిపారు. మోడీ, కేసీఆర్.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారు. హైదరాబాద్లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయి. బీహెచ్ఈఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. కాంగ్రెస్ తెచ్చిన పరిశ్రమలను మోడీ సర్కారు అమ్ముకుంటోంది. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. భారాస సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచింది. కేసీఆర్, మోడీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారు. ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నారు” అని ఖర్గే విమర్శించారు.