తెలంగాణ:తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలోని పెద్ద మల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తెలంగాణ కరెంట్‌పై చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు.తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుతు కష్టాలు తీర్చామన్నారు. అందువల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, బీడీ కార్మికులకు కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని.. మేము పెన్షన్ ఇచ్చి ఆదుకున్నామన్నారు. కేసీఆర్ కామారెడ్డి నుండి గెలిచి హ్యాట్రిక్ సీయం కాబోతున్నారని, వచ్చే ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాహుల్ గాంధీకి, మోడీకి తెలంగాణపై ప్రేమ లేదని, కేసిఅర్‌ని కామారెడ్డిలో గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివఅద్ధి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.