ఓటరు జాబితాలో అక్రమాలు – చుండూరు తహశీల్దారు సస్పెన్షన్‌

Nov 25,2023 08:57 #mro

ప్రజాశక్తి- బాపట్ల జిల్లా ఓటర్ల సవరణ జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో బాపట్ల జిల్లా చుండూరు తహశీల్దారు బి.సురేష్‌బాబును సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్‌బాబు గతంలో బాపట్ల జిల్లా మార్టూరు తహశీల్దారుగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓటర్ల సవరణ జాబితాలో అక్రమాలకు పాల్పడినట్లు పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ దర్యాప్తు నిర్వహించారు. ఓటర్ల జాబితా ఫారం 7 దరఖాస్తుల విషయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలడంతో సురేష్‌బాబును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

➡️