ఐఆర్‌ఆర్‌ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై విచారణ వాయిదా

అమరావతి : రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సిఐడి సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జడ్జిలను దూషించారంటూ ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

➡️