జగిత్యాల (తెలంగాణ) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారంలో ఉండగా… ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా … కవిత కళ్లు తిరిగిపడిపోయారు. గమనించిన బిఆర్‌ఎస్ శ్రేణులు వెంటనే కవితను చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం కోలుకున్న ఆమె తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
