అందుబాటులోకి ఐఆర్‌సీటీసీ సేవలు

Nov 23,2023 15:26 #irtc supervises, #special trains

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ సేవల్లో గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. తత్కాల్‌ సమయం కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.గురువారం ఉదయం నుంచి పలువురు యూజర్లు టికెట్లు బుక్‌ చేయలేకపోతున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. టికెట్‌ బుక్‌ చేస్తుంటే ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోందంటూ సంబంధిత స్క్రీన్‌షాట్లు షేర్‌ చేశారు. టికెట్‌ బుక్‌ చేసినప్పుడు మెయింటెనెన్స్‌ కారణంగా ఈ-టికెట్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని సందేశం వస్తోందని, యాప్‌లోనూ ‘అనేబుల్‌ టు కనెక్ట్‌’ అనే సందేశం కనిపిస్తోందని తమ పోస్టుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. సాంకేతిక కారణాల వల్ల ఇ-టికెట్‌ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. టెక్నికల్‌ టీమ్‌ దీనిపై పనిచేస్తోందని పేర్కొంది. మధ్యాహ్నం 1.55 గంటలకు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు మరో పోస్ట్‌లో పేర్కొంది.

➡️