కాల్పుల్లో కుకీ-జో గిరిజనుడు మృతి
గౌహతి: మణిపూర్‌లో హింసాత్మక అల్లర్లు తగ్గుముఖం పట్టటం లేదు. అక్కడ మళ్లీ హింస చెలరేగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో కుకీ-జో అనే గిరిజనుడు (21) మరణించాడు. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్) మతుడిని ఫైఖోలం గ్రామానికి చెందిన ఖుప్మింతంగ్‌గా గుర్తించింది. అతను గ్రామ వాలంటీర్ అని గిరిజన సంస్థ తెలిపింది. ఇంఫాల్ లోయలోని బిష్ణుపూర్ జిల్లా సరిహద్దులో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలోని కుకి-జో గ్రామమైన జూపి వద్ద కాల్పులు జరిగాయి. దుండగులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారనీ, అయితే కుకీ-జో గ్రామ వాలంటీర్లు సింగిల్ బ్యారెల్ రైఫిల్స్‌తో గ్రామాన్ని రక్షించేందుకు తమ వంతుగా నిలబడ్డారని ఐటీఎల్‌ఎఫ్ తెలిపింది. ఈ సంఘటన తర్వాత కాంగ్‌పోక్పి-బిష్ణుపూర్ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న గ్రామస్థులు మరింత దాడులు, ప్రతిదాడులను చేయటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది.